ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..!

వ్యవసాయమే అతనికి ఆధారం. యంత్రాలతో సాగు చేసేంత పెట్టుబడి లేదు. ఖరీఫ్​ రానే వచ్చింది. ఉన్న ఎద్దులతోనే పొలాన్ని సిద్ధం చేసేందుకు పూనుకున్నాడు. ఇంతలోనే ఓ ఎద్దు కాలం చేయటం.. ఓ వైపు వరుణుని రాక.. చేతిలో డబ్బులు లేకపోవటం.. ఈ ఒడుదొడుకులన్నింటినీ దాటేందుకు.. తన కొడుకునే కాడెద్దును చేశాడు ఆ రైతు..!

By

Published : Jun 15, 2021, 8:31 AM IST

కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..!
కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..!

కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..!

కన్నకొడుకే కాడెద్దులా మారి పొలం చదను చేసిన ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌కు చెందిన ఆదివాసీ రైతు అభిమాన్‌కు ఆరెకరాల పొలం ఉంది. ఖరీఫ్‌ పనులు వేగం కావడం వల్ల తనకున్న ఎద్దులతో పొలాన్ని చదను చేసే క్రమంలో.. అనారోగ్యంతో ఆదివారం రోజున ఓ ఎద్దు చనిపోయింది.

పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న అభిమాన్‌... మరో ఎద్దును కొనాలంటే కనీసం రూ. 40 వేలు ఖర్చుచేయాల్సి ఉంటుంది. పైగా సొమవారం వరుణుడు పలకరించడం వల్ల సమయం దాటిపోకుండా ఉండాలంటే పొలాన్ని చదును చేయకతప్పని పరిస్థితి. ఉన్న ఒక్క ఎద్దుతోపాటు మరోవైపు తన కన్నకొడుకు సాయినాథ్‌నే కాడెద్దుగా మార్చి పొలం చదనుచేశాడు. చేతిలో డబ్బులేనిది ఏంచేస్తాం..? ఏదో ఒకరకంగా బతకాలి కదా..! అనే తన మాటలు కదిలిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details