ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యానికి బానిసై..షేవింగ్‌ లోషన్‌ తాగి మృతి - కృష్ణా జిల్లా తాజా వార్తలు

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి..దానిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక తాను పనిచేసే సెలూన్‌ దుకాణంలో ఉన్న షేవింగ్‌ లోషన్‌ను తాగి మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నగరం సాయిరాం థియేటర్‌ ఎదురువీధి అడ్డరోడ్డులోని పోతన భవనంలో యలమంచిలి లక్ష్మణ్‌ నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఆయన సాయిరాం థియేటర్‌ వద్ద ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. అతను మద్యానికి బానిసై రోజూ తాగుతుంటాడు. ఈ నెల 5వ తేదీన షాపునకు వెళ్లాడు. ఆ రోజు మద్యం తాగేందుకు డబ్బులు దొరకలేదు. దీంతో అక్కడే ఉన్న షేవింగ్‌కు ఉపయోగించే లోషన్‌ను తాగాడు. సాయంత్రానికి గుండెల్లో నొప్పి, వాంతులు, కడుపులో నొప్పితో బాధపడుతూ ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు.

Addicted to alcohol..died shaving lotion
మద్యానికి బానిసై..షేవింగ్‌ లోషన్‌ తాగి మృతి

By

Published : Dec 8, 2020, 10:31 AM IST

మద్యానికి బానిసైన ఓ వ్యక్తి..దానిని కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక తాను పనిచేసే సెలూన్‌ దుకాణంలో ఉన్న షేవింగ్‌ లోషన్‌ను తాగి మృతి చెందిన సంఘటన సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నగరం సాయిరాం థియేటర్‌ ఎదురువీధి అడ్డరోడ్డులోని పోతన భవనంలో యలమంచిలి లక్ష్మణ్‌ నాగమణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారు. ఆయన సాయిరాం థియేటర్‌ వద్ద ఓ సెలూన్‌లో పని చేస్తున్నాడు. అతను మద్యానికి బానిసై రోజూ తాగుతుంటాడు. ఈ నెల 5వ తేదీన షాపునకు వెళ్లాడు. ఆ రోజు మద్యం తాగేందుకు డబ్బులు దొరకలేదు. దీంతో అక్కడే ఉన్న షేవింగ్‌కు ఉపయోగించే లోషన్‌ను తాగాడు. సాయంత్రానికి గుండెల్లో నొప్పి, వాంతులు, కడుపులో నొప్పితో బాధపడుతూ ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు విజయవాడ చిట్టినగర్‌ పోలీసులు తెలిపారు.

మంచి నీళ్లు అనుకుని.. అమ్మోనియా ద్రావకం తాగి..

మంచి నీళ్లు అనుకుని అమ్మోనియా ద్రావకం తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి...భవానీపురం డాల్ఫిన్‌బార్‌ రోడ్డులో రెహ్మతుల్లా(54) నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన పున్నమిఘాట్‌ సమీపంలో రంగులు తయారు చేస్తుంటారు. వాటి తయారీకి ఉపయోగించే అమ్మోనియా ద్రావకం ఒక బాటిల్‌లో పట్టి ఉంది. ఆ పక్కనే తాగే నీళ్ల బాటిల్‌ కూడా ఉంది. సోమవారం మధ్యాహ్నం దాహం వేయడంతో నీళ్లు సీసా అనుకుని అమ్మోనియా ద్రావకం ఉన్నసీసాను తెరిచి తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తోటి కార్మికులు గుర్తించి అతన్ని నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details