DIVYAVANI: తెదేపా నేత దివ్యవాణి రాజీనామా అంశం కలకలం రేపింది. వర్రా రవీందర్రెడ్డి పేరుతో వచ్చిన పోస్ట్ చూసి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు ఆమె తెలిపారు. ఆ పోస్టులో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు దివ్యవాణిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉంది. ఈ అంశం తెరపైకి రావడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. తాము దివ్యవాణిని సస్పెండ్ చేయలేదని.. అది ఫేక్ పోస్టింగ్ అని స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ కొందరు తప్పుడు పోస్టింగులు పెట్టారని తెదేపా ఆరోపించింది. దీంతో దివ్యవాణి తాను రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్లో పెట్టిన పోస్టును తొలగించారు.
దివ్యవాణి సస్పెన్షన్.. రాజీనామా.. చివరకు - ap latest news
DIVYAVANI: పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్లో ప్రకటించిన దివ్యవాణి అంతలోనే దాన్ని తొలగించారు. బచ్చుల అర్జునుడు పేరుతో వచ్చిన పోస్టింగ్ ఆధారంగా రాజీనామాకు సిద్ధపడినట్లు ఆమె తెలిపారు.
తెదేపా అధికార ప్రతినిధి పదవికి దివ్యవాణి రాజీనామా
"పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" -దివ్యవాణి ట్వీట్
ఇవీ చదవండి:
Last Updated : May 31, 2022, 5:40 PM IST