రాష్ట్రంలోని వరద బాధితులకు సాయం చేస్తానని నటుడు సోనూ సూద్ (sonu sood help to flood victims) తెలిపారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాల బాధితుల విజ్ఞప్తులపై సోనూ స్పందించారు. వరద బాధితుల కష్టాలను ఆదిరెడ్డి అనే నెటిజన్ ట్విట్టర్ ద్వారా సోనూ సూద్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించాడీ రియల్ హీరో!
సహాయ సామగ్రి పంపుతున్నట్లు ట్విట్టర్ ద్వారా సోనూ తెలిపారు. కూలిన ఇళ్లను నిర్మించుకుందామని సోనూ సూద్ పిలుపునిచ్చారు.