Actor Jayasudha: భాజపా నేతలు తన ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధమన్న సినీనటి జయసుధ ప్రకటించారు. అయితే ఈ నెల 21 భాజపాలో చేరడం లేదని స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదని తెలిపారు. ఈనెల 21 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు భాజపాలో చేరతారనే వార్తలపై ఆమె స్పందించారు.
Jayasudha: ఆ ప్రతిపాదనలు అంగీకరిస్తే.. భాజపాలో చేరుతా: జయసుధ - భాజపాలో చేరడం లేదన్న జయసుధ
Jayasudha to BJP: ఈనెల 21న భారతీయ జనతా పార్టీలో చేరే అంశంపై సినీ సీనియర్ నటి జయసుధ స్పందించారు. తాను ఇప్పుడే భాజపాలో చేరడం లేదని.. తాను కొన్ని ప్రతిపాదనలు పార్టీ ముందుంచినట్లు తెలిపారు. అవి అంగీకరిస్తే.. భాజపాలో చేరేందుకు సిద్ధమని తెలిపారు.
jayasudha
అయితే భాజపాలో చేరేందుకు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్లు సినీనటి జయసుధ వెల్లడించారు. తన ప్రతిపాదనలు అంగీకరిస్తే భాజపాలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. దిల్లీ పెద్దలు మాట్లాడి హామీ ఇస్తే పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు జయసుధ పేర్కొన్నారు. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈనెల 21 అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఇవీ చదవండి: