ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తమ వృత్తిని అవమానించే వారిపై చర్యలు తీసుకోవాలి' - విజయవాడలో నాయి బ్రాహ్మణ సంఘం నిరసన

సామెతల పేర్లతో తమ వృత్తిని అవమానించే వారిపై చర్యలు తీసుకునే విధంగా రక్షణ చట్టం తీసుకురావాలని నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా...నాయి బ్రాహ్మణుల వృత్తిపట్ల సమాజంలో చులకన భావం ఉందని ఆయన వాపోయారు.

'వృత్తిని అవమానపరిచే వారిపై చర్యలు తీసుకోవాలి'
'వృత్తిని అవమానపరిచే వారిపై చర్యలు తీసుకోవాలి'

By

Published : Dec 15, 2020, 3:25 PM IST

సామెతల పేరుతో వృత్తిని అవమానపరిచే వారిపై కేసులు పెట్టే విధంగా సామాజిక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నాచౌక్​లో సాధన దీక్ష చేపట్టారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా...నాయి బ్రాహ్మణుల వృత్తిపట్ల సమాజంలో చులకన భావం ఉందని వాపోయారు. సామెతల పేర్లతో తమ వృత్తిని అవమానించే వారిపై చర్యలు తీసుకునే విధంగా రక్షణ చట్టం తీసుకురావాలని సంఘం అధ్యక్షుడు సూరిబాబు డిమాండ్ చేశారు.

నాయి బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమాల్లో..సామాజిక మాధ్యమాల వేదికగా సామెతలు పేర్లతో అవమానపరిచి దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించే విధంగా నూతన చట్టాన్ని తీసుకురావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details