ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Satyambabu: జైలుకు వెళ్లి పదేళ్ల జీవితాన్ని కోల్పోయాను: సత్యంబాబు - అయేషామీరా హత్య కేసు

గతంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో.. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు (Satyambabu) మరోసారి సుప్రీంకోర్టు కార్యాలయానికి వెళ్లారు. తనను నిందితుడిగా చూపించిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోర్టు తెలిపినా.. ఇప్పటివరకు అమలు కాలేదని.. ఫిర్యాదు కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో అందజేశారు. తనకు సంబంధం లేని కేసులో జైలుకు వెళ్లి.. పదేళ్ల జీవితాన్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

acquitted satyambabu in ayesha meera case complained to cji office
సుప్రీంకు వెళ్లిన సత్యంబాబు

By

Published : Nov 20, 2021, 6:34 PM IST

ఆయేషా మీరా హత్య కేసు(ayesha meera case)లో తన ప్రమేయం లేకపోయినా.. అనవసరంగా తనకు అంటగట్టడమే కాకుండా.. తన కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారని నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో కోర్టు.. పోలీసుల తీరును తప్పుబట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చినా.. ఇప్పటి వరకు అమలు కాలేదని వాపోయారు. ఈ మేరకు.. సత్యంబాబు, జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాంప్రసాద్‌ కలిసి.. ఫిర్యాదు కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో అందజేశారు.

పదేళ్లపాటు జైలులో అనేక ఇబ్బందులు పడినట్లు పేర్కొన్న సత్యంబాబు.. నాలుగేళ్ల నుంచి జైలు బయట ఉన్నా.. అవే ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని కేసులో జైలుకు వెళ్లడంతో.. పదేళ్ల జీవితం కోల్పోయినట్లు పేర్కొన్నారు. చేయని నేరానికి శిక్ష అనుభవించి.. పోలీసు, దర్యాప్తు సంస్థల నిస్సహాయతకు సజీవ సాక్ష్యంగా నిలిచినట్లు వాపోయారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details