ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'గీతం... భారతి సిమెంట్​లాగా అక్రమార్జనతో పెట్టిన సంస్థ కాదు' - అచ్చెన్నాయుడు తాజా వార్తలు

ఐదు వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గీతం సంస్థను.. అర్ధరాత్రి ధ్వంసం చేయడాన్ని ఏమనాలో అర్ధం కావడంలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏడాదిన్నర వైకాపా పాలనలో విధ్వంసాలు చేయడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు.

achhennaidu
అచ్చెన్నాయుడు

By

Published : Oct 24, 2020, 2:16 PM IST

ఏడాదిన్నరగా సీఎం జగన్ చేసింది విధ్వంసాలు, కుట్రలు, ఆస్తుల ధ్వంసం, అక్రమ కేసుల బనాయింపేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో సరైన విద్యాసంస్థలు లేకపోతే గాంధీ స్ఫూర్తితో గీతం విశ్వవిద్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు. ఎందరినో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది 5 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థను.. అర్ధరాత్రి వందలమంది వెళ్లి ధ్వంసం చేయటాన్ని ఏమనాలో అర్థం కావట్లేదని మండిపడ్డారు. భారతి సిమెంట్​లాగా అక్రమార్జనతో లాభాపేక్ష కోసం పెట్టిన సంస్థ కాదన్నారు. విద్యావకాశాలు, ఉపాధి కల్పించటానికి పెట్టిన సంస్థపైనే దాడి చేస్తే ఇక రాష్ట్ర భవిష్యత్తు ఏమిటో ప్రజలు ఆలోచించాలని కోరారు.

గీతం వర్శిటీ ప్రాంగణంలో అక్రమ కట్టడాలు ఉంటే నోటీసులు ఇచ్చి పగలు కూల్చాలి. అంతేకానీ మేనేజ్​మెంట్ లేని సమయంలో అర్ధరాత్రి వందల మంది పోలీసులతో వెళ్లి కూల్చడం ఏంటి. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి విధ్వంసాలు, ఆస్తుల ధ్వంసం తప్ప చేసిందేమీ లేదు. గీతం వర్శిటీ ఏమీ భారతి సిమెంట్స్​లాగా అక్రమార్జనతో, లాభాపేక్ష కోసం పెట్టిన సంస్థ కాదు. కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్దిన విద్యాలయం. మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సంస్థ. అటువంటి సంస్థను కూల్చేస్తారా.-- అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details