ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బీసీల ముసుగులో రాష్ట్రంలో షాడో పాలన: అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి జగన్ కుట్రలను బీసీలు గ్రహించాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ రెడ్డి.. తన సొంత సామాజికవర్గానికే ఉన్నత పదవులు కేటాయిస్తూ కార్పొరేషన్ పదవుల పేరుతో బీసీల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.

achennayudu fire on ycp
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

By

Published : Mar 18, 2021, 7:32 PM IST

బీసీల ముసుగులో రాష్ట్రంలో షాడో పాలన సాగుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. బీసీల పేరుతో పదవులు, హోదాను.. జగన్ అండ్ కో అనుభవిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నత పదవులన్నీ ఒకే సామాజికవర్గానికి ఇస్తున్నారని.. కార్పొరేషన్ పదవులంటూ బీసీల పట్ల వైకాపా అధినేత మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. 742కు పైగా నామినేటెడ్ పదవులను జగన్ రెడ్డి.. తన సొంత సామాజికవర్గానికే కేటాయించుకున్నారని తెలిపారు. ఉన్నత పదవులను సొంతవారితో నింపేయటం సామాజిక న్యాయమా..? అని ప్రశ్నించారు.

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్​లను 24 శాతానికి తగ్గించి వారి గొంతు కోశారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఆధిపత్యం కోసం బలహీన వర్గాల రక్తాన్ని కళ్ల చూశారని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి కుట్రలను బీసీలు గ్రహించాలన్నారు. ఒకే సామాజికవర్గం గుప్పిట్లో రాష్ట్రం మొత్తాన్ని ఉంచి రూ. వేల కోట్ల అవినీతికి బాటలు వేశారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details