ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తాడేపల్లి ప్యాలెస్ డైెరెక్షన్​లో మెడికల్ బోర్డు రిపోర్ట్' - mp raghurama krishna raju case update

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏమి జరిగినా సీఎం జగన్, సీఐడీదే బాధ్యత అని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఎంపీని హింసించిన తీరుపై మానవహక్కుల సంఘాలు స్పందించాలని కోరారు.

tdp ap chief achennaidu
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

By

Published : May 16, 2021, 8:12 PM IST

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఎంపీ రఘురామకృష్ణరాజును జైలుకు తరలించారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆయనకు ఏమి జరిగినా సీఎం జగన్, సీఐడీ అధికారులదే బాధ్యత అని హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్​లో మెడికల్ బోర్డు నివేదికలు మారాయని ఆరోపించారు. ఇవాళ మధ్యాహ్నానికి వైద్యపరీక్షల నివేదిక అందించాలని హైకోర్టు చెప్పినా.. పట్టించుకోకుండా జాప్యం చేశారని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'మేమూ మోదీని ప్రశ్నిస్తాం.. అరెస్టు చేయండి'

తన భర్తకు ప్రాణహాని ఉందని రఘురామ భార్య ఆందోళన చెందుతోందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మీద పోలీసుల చర్యపై మానవహక్కుల సంఘాలు స్పందించాలని కోరారు. కోర్టు ఆదేశాలకు లోబడి.. రఘురామకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:

నా భర్తకు ప్రాణహాని ఉంది: ఎంపీ రఘురామ భార్య రమ

ABOUT THE AUTHOR

...view details