వారెంట్ లేకుండా ఎంపీ రఘురామకృష్ణ రాజుని ఎలా అరెస్టు చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. వై-కేటగిరి భద్రతలో ఉన్న పార్లమెంటు సభ్యుడి గౌరవానికి భంగం కలిగిస్తూ..లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకోకుండా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. జగన్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆయన మండిపడ్డారు. రఘురామ అరెస్టు కక్షసాధింపులో భాగమేనన్నారు.
రఘురామ ప్రశ్నలకు జవాబివ్వలేకే అక్రమ అరెస్టు: అచ్చెన్న - రఘురామ ప్రశ్నలకు జవాబివ్వలేకే అక్రమ అరెస్టు న్యూస్
వారెంట్ లేకుండా ఎంపీ రఘురామకృష్ణరాజును ఎలా అరెస్ట్ చేస్తారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రఘురామ ప్రశ్నలకు జవాబివ్వలేకే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. రూల్ ఆఫ్ లాను నిర్వీర్యం చేస్తూ భయపెడుతున్నారని ఆక్షేపించారు.
"రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రూల్ ఆఫ్ లా పాటించట్లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గొంతునొక్కే ప్రయత్నం చేయటం పోలీసులకు తగదు. రఘురామకృష్ణ రాజు ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే అక్రమ అరెస్టుకు పూనుకున్నారు. తన ప్రత్యర్థులపై జగన్ దమనకాండ కొనసాగిస్తున్నారనటానికి ఇదో నిదర్శనం. గుండె జబ్బుతో బాధపడుతున్న ఎంపీని పుట్టినరోజు నాడే మానవత్వం లేకుండా కర్కశకత్వంగా వ్యవహరించినందుకు పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీ ముందు సీఐడీ పోలీసులు సంజాయిషీ చెప్పక తప్పదు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధించేందుకు జగన్ రెడ్డి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయటాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది." అని అచ్చెన్న వ్యాఖ్యనించారు.
ఇదీచదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన సీఐడీ అధికారులు
TAGGED:
రఘరామ అరెస్టు న్యూస్