విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును దిశ పోలీసులు కస్టడీలోకి తీసుకుని తొలిరోజు విచారించారు. యువతితో తనకు ముందే పరిచయం ఉందని అతను విచారణలో వెల్లడించినట్లు సమాచారం. అతను చెప్పింది నిజమో..కాదో తెలుసుకునేందుకు గురువారం యువతి చదువుకున్న ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లి విచారించనున్నారు. తొలి రోజు విచారణ అనంతరం నాగేంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితుడిని విజయవాడ జిల్లా జైలులో అప్పగించారు. గురువారం ఉదయం మళ్లీ తమ కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు.
విద్యార్థిని హత్య కేసు: కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు ? - divya tejaswini murder case
రాష్ట్రవ్యాప్తంగా సంచనలం స్పష్టించిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు నాగేంద్రబాబును దిశా పోలీసులు కస్టడీలోకి తీసుకుని తొలిరోజు విచారించారు. ఈ క్రమంలో పోలీసులకు అతను కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం.
divya tejaswini murder case