విశాఖ విమానాశ్రయంలో జగన్‌పై దాడి చేసిన కేసులో నిందితుడు జలపల్లి శ్రీనివాసరావు విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ ఉంచింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తూ.. ‘శ్రీనివాస్ చాలా రోజులుగా జైల్లో ఉన్నాడు. పిటిషనర్‌పై ఆరోపణ సాధారణ గాయం చేశారని మాత్రమే. కోడికత్తి అసలు ఆయుధమే కాదు. ఇలాంటి ఘటనల్లో న్యాయస్థానాలు బెయిలిచ్చిన సందర్భాలున్నాయి. పిటిషనర్ తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బెయిలు మంజూరు చేయండి’ అని కోరారు. ఎన్‌ఐఏ తరఫున సీనియర్ పీపీ సిద్దిరాములు వాదనలు వినిపిస్తూ ‘నిందితుడికి బెయిల్ ఇవ్వాలంటే... అతను నేరం చేయలేదని న్యాయస్థానం విశ్వసించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడరని నమ్మాలి. ఇప్పటికే ఈ కేసులో అభియోగపత్రం దాఖలు చేశాం’ అని వివరించారు.
కోడి కత్తి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి - కొడికత్తి కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు న్యూస్
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో బెయిలు మంజూరుకు నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో మంగళవారం వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి తన నిర్ణయాన్ని బుధవారం వెల్లడించే అవకాశముంది.
కొడికత్తి కేసు: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నిందితుడు శ్రీను