ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రోడ్డు మధ్యలో శిలాఫలకం.. ప్రమాదాలకు కారణం

విజయవాడ నగర శివారులోని నూజివీడు రహదారి డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం ప్రమాదాలకు కారణమవుతుందని స్ధానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Accidents are taking place with a stone slab set up in the middle of the Vijayawada Noojeedu road divider
ప్రమాదాలకు కారణమవుతున్న శిలాఫలకం

By

Published : Feb 22, 2021, 6:21 PM IST

విజయవాడ-నూజివీడు రహదారిపై కిలోమీటర్ మేర సెంట్రల్ లైటింగ్​ను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ప్రారంభోత్సవానికి రోడ్డు డివైడర్ మధ్యలో శిలా ఫలకాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా సెంట్రల్​ లైటింగ్​ను ప్రారంభించారు.

కండ్రికకు వెళ్ళే మలుపు వద్ద ఏర్పాటు చేసిన ఈ శిలా ఫలకం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ శిలాఫలకం కనిపించకపోవడమే ప్రమాదాలకు కారణమని తెలుపుతున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సభ్యుడిగా మంత్రి పెద్దిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details