సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టంచేశారు. దేశంలోని ప్రతి పౌరుడూ రాజ్యాంగ బద్ధుడేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాలకుడైనా.., పౌరుడైనా రాజ్యాంగానికి బద్ధుడై ఉండాల్సిందేనన్నారు. అతీత శక్తిగా వ్యవహరిస్తే ఎదురు దెబ్బలు తప్పవని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా పని చేయాలని సూచించారు.
'జగన్ వెంట నడుస్తారో..ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో..తేల్చుకోండి' - జగన్పై అచ్చెన్నాయుడు కామెంట్స్
న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తింటున్న జగన్ వెంట నడుస్తారో.., ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమన్నారు.
జగన్ వెంట నడుస్తారో..ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో..తేల్చుకోండి
ప్రజలు, వ్యవస్థలు మాత్రమే శాశ్వతమని..ప్రభుత్వాలు కాదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి కోసం పని చేస్తే రాజ్యాంగం చేతుల్లో చెప్పు దెబ్బల రివార్డులు వస్తాయని ఎద్దేవా చేశారు. కోర్టుల్లో ఎదురు దెబ్బలు తింటున్న జగన్ వెంట నడుస్తారో..,ప్రజాస్వామ్య హితులుగా నిలుస్తారో ఉద్యోగ సంఘాలు నిర్ణయించుకోవాలని సూచించారు.