ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బెదిరింపులకు పాల్పడుతున్న ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయాలి' - అచ్చెన్న తాజా వార్తలు

తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా విజయాన్ని అడ్డుకోలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఓజిలిలో తెదేపా నాయకులను బెదిరిస్తున్న సీఐ నరసింహారావు, ఎస్ఐ శేఖర్ బాబులను తక్షణమే విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

acchenna demands police suspension
బెదిరింపులకు పాల్పడుతున్న ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయాలి

By

Published : Apr 15, 2021, 7:26 PM IST

"నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలిలో తెదేపా నాయకులను బెదిరిస్తున్న సీఐ నరసింహారావు, ఎస్ఐ శేఖర్ బాబులను తక్షణమే విధుల నుంచి తప్పించాలి" అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పోలింగ్ బూత్ ఏజంట్లను పెడితే సంగతి చూస్తామని బెదిరిస్తున్న ఇద్దరు అధికారులు... పోలీసు శాఖలో పనిచేస్తున్నారా ? లేక వైకాపాలో పనిచేస్తున్నారా ? అని ప్రశ్నించారు.

మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మారితే మళ్లీ పోలీసు ఉద్యోగమే చేయాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. పోలీసులు నిస్పక్షపాతంగా వ్యవహరించకుంటే భవిష్యత్​లో తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. బెదిరింపులు, తప్పుడు కేసులతో తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా విజయాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details