గత నెలలో ఇంద్రకీలాద్రిపై వరుసగా ఐదు రోజుల పాటు 8 విభాగాలను జల్లెడపట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులు..... పలు అవకతవకలను గుర్తించి.... వాటిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. పరిపాలనాపరంగా ఈవో సురేష్‌బాబు వైఫల్యాలను నివేదికలో బయటపెట్టారు. ఎలాంటి టెండర్లు పిలవకుండానే...... గుంటూరు జిల్లాకు చెందిన సహకారేతర డెయిరీ సంగం నుంచి.... ఐదేళ్ల పాటు నెయ్యి కొనుగోలు చేశారని.... ఆడిట్ విభాగం అభ్యంతరంతో అప్పుడు టెండర్లు పిలిచారని అ.ని.శా పేర్కొంది. హౌస్‌కీపింగ్, పారిశుద్ధ్య సేవలకు టెండర్లు పిలిచిన అధికారులు....ఎల్1ను కాదని, ఎల్3కి కట్టబెట్టారని వివరించింది. టెండర్ పత్రంలో పేర్కొనని నిబంధనను సాకుగా చూపి ఎల్1ను తిరస్కరించారని..... ఇది సీవీసీ మార్గదర్శకాలకు విరుద్ధమని.... ఎల్1కు తగిన అర్హతలు లేవనుకుంటే తిరిగి టెండర్లకు వెళ్లాలని అ.ని.శా వ్యాఖ్యానించింది.
ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా మ్యాక్స్ సంస్థ ఎంపిక
2019 సెప్టెంబర్ నుంచి 2020 ఆగష్టు కాలానికి..... ఆలయ భద్రత కోసం మ్యాక్స్ డిటెక్టివ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థను ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ఈవో ఎంపిక చేశారని అ.ని.శా. తన నివేదికలో పేర్కొంది. అనంతరం.... మరో ఏడాది పొడిగింపునకు సంస్థ కోరినా.... దేవదాయశాఖ కమిషనర్ తిరస్కరించి... కొత్తగా టెండర్లను పిలవాలని ఈవోను ఆదేశించినట్టు అ.ని.శా. వివరించింది. ఈ మేరకు కొత్త టెండర్లు పిలిచాక..... మ్యాక్స్ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వాలని కమిషనర్‌కు ఈవో సిఫార్సు చేయగా.... దీనిపై నిర్ణయం వెలువడక ముందే .... కమిషనర్ ఆమోదించకుండానే ఏజెన్సీకి సొమ్ము చెల్లించారని అ.ని.శా. ఆక్షేపించింది. కమిషనర్, స్టేట్ ఆడిట్ సంచాలకుడి మార్గదర్శకాలను ఉల్లంఘించి టెండర్లు, కొటేషన్లు, సరకుల కొనుగోళ్ల టెండర్లను ఖరారు చేశారని.... వీటి బిల్లులను ఆడిట్ చేయించి చెల్లించాలని నిబంధనలు ఉన్నా...... వాటిని పట్టించుకోలేదని అ.ని.శా. తన నివేదికలో పేర్కొంది.
ఆస్తుల రిజిస్టర్ అప్‌డేట్ చేయలేదు:అనిశా
మూడేళ్లకోసారి ఆస్తుల రిజిస్టర్‌ను అప్‌డేట్ చేయాలని ఆదేశాలున్నా.... ఈవో దీన్ని నిర్వర్తించలేదని అ.ని.శా. వివరించింది. 2010 నుంచి ఇది అప్‌డేట్ అవలేదని గుర్తించింది. ఆలయ భూముల వివరాలు నమోదు చేసే 8ఏ రిజిస్టర్ నిర్వహణ సరిగ్గా లేదని ఆక్షేపించింది. అన్నదానం స్టోర్స్ నగదు రిజిష్టర్‌లో ఫిబ్రవరి 11 నుంచి ఈవో కౌంటర్ సంతకం చేయలేదని వివరించింది. దర్శనం టిక్కెట్ కౌంటర్లలోనూ అ.ని.శా. లోపాలను గుర్తించింది. ఐదు హారతి టిక్కెట్లను డబ్బులు తీసుకోకుండానే ఇవ్వడం వల్ల ఆర్జిత సేవా కౌంటర్‌లో రికార్డ్ అసిస్టెంట్ వద్ద రెండున్నర వేల రూపాయలు తక్కువ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రతి డీసీఆర్ రశీదుపై సూపరింటెడెంట్ సంతకం చేయట్లేదని.... స్కానింగ్ పాయింట్ వద్ద ఆన్‌లైన్ టిక్కెట్లను సరిగ్గా స్కాన్ చేయట్లేదని అ.ని.శా పేర్కొంది.