లంచం అడిగితే నేరుగా ‘ఏసీబీ 14400’ యాప్ ద్వారా అవినీతి నిరోధకశాఖకు (ఏసీబీ) ఫిర్యాదు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో ఉన్న వీడియో, ఆడియో ద్వారా లంచం అడిగిన వారి సంభాషణలను రికార్డు చేస్తే.. ఆ వివరాలు నేరుగా ఏసీబీకి చేరతాయని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ‘ఏసీబీ 14400’ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతి నిరోధక చర్యల్లో ప్రతి కలెక్టరు, ఎస్పీకి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు.
‘‘మన స్థాయిలో అనుకుంటే 50శాతం అవినీతి అంతమవుతుంది. అవినీతికి పాల్పడి ఎవరైనా పట్టుబడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా రూ.1.41 లక్షల కోట్ల మొత్తాన్ని అవినీతి, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా వేశాం’’ అని తెలిపారు.
యాప్ ఎలా పని చేస్తుందంటే
*గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘ఏసీబీ 14400’ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. ఫోన్ నంబరు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.