ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sangam Dairy Case: ధూళిపాళ్ల బెయిల్‌ రద్దు చేయాలంటూ హైకోర్టులో అనిశా పిటిషన్‌ - ధూళిపాళ్ల బెయిల్‌ రద్దు చేయాలంటూ హైకోర్టులో అనిశా పిటిషన్‌ వార్తలు

సంఘం డెయిరీ కేసు(Sangam Dairy Case)లో ధూళిపాళ్ల నరేంద్ర బెయిల్‌ రద్దు చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం..కౌంటర్‌ వేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.

acb field  Petition in the High Court over sangam dairy case
ధూళిపాళ్ల బెయిల్‌ రద్దు చేయాలంటూ హైకోర్టులో అనిశా పిటిషన్‌

By

Published : Jun 18, 2021, 6:43 PM IST

Updated : Jun 18, 2021, 11:50 PM IST

సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎండీ గోపాలకృష్ణన్​కు మే 24న మంజూరు చేసిన బెయిల్​ను రద్దు చేయాలని కోరుతూ అనిశా గుంటూరు డీఎస్పీ హైకోర్టులో వేర్వేరుగా 2 వ్యాజ్యాలు దాఖలు చేశారు. బెయిలు షరతులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపారు. కౌంటర్ వేయాలని ధూళిపాళ్ల తరపు న్యాయవాదిని ఆదేశిస్తూ.... విచారణను ఈ నెల 23 కు వాయిదా వేశారు. బెయిల్ పై విడుదలయ్యాక సంగం బోర్డు డైరెక్టర్లు, ఇతర అధికారులతో నోవాటెల్ హోటల్లో ధూళిపాళ్ల సమావేశం నిర్వహించారని....అనిశా తరపు న్యాయవాది తెలిపారు. ఈ సమావేశంలో గోపాలకృష్ణతో పాటు 25 మంది పాల్గొన్నారన్నారని... వారికి పలు సూచనలు చేశారని కోర్టుకు తెలిపారు. సమావేశం నిర్వహించడం ద్వారా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని....అందుకే బెయిలు రద్దు చేయండి అని అని అనిశా అధికారులు కోరారు.

Last Updated : Jun 18, 2021, 11:50 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details