రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కొవిడ్ బారిన పడిన సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్‌కు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు అనిశా కోర్టు అనుమతినిచ్చింది. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు.. ఆయన్ను ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని జైలు అధికారులను ఆదేశించింది. నిన్న కొవిడ్ బారిన పడిన ఆయన ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రైవేటు ఆసుపత్రికి సంగం డెయిరీ ఎండీ.. అనిశా కోర్టు అనుమతి! - ప్రైవేటు ఆసుపత్రికి సంగం డెయిరీ ఎండీ వార్తలు
సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్... ప్రైవేట్ ఆస్పత్రిలో కొవిడ్ చికిత్స తీసుకునేందుకు అనిశా కోర్టు అనుమతినిచ్చింది. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలంటూ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్ మేరకు న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రైవేటు ఆసుపత్రికి సంగం డెయిరీ ఎండీ