విజయవాడ కృష్ణా కెనాల్ డివిజన్ పరిధిలోని రివర్ కన్జర్వెన్సీ సబ్ డివిజన్‌లో డీఈఈగా పనిచేస్తున్న రాయన శ్రీనివాసరావు.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన భట్టు విజయసాగర్ గుంటూరు జిల్లా, కొల్లూరు మండలంలోని గాజులలంకలో ఇసుక క్వారీను లీజుకు తీసుకున్నాడు. పట్టా భూముల్లోని ఇసుక తొలగించేందుకు కృష్ణా కెనాల్ సెంట్రల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుకు దరఖాస్తు చేసుకున్నారు. క్లియరెన్స్ లేఖను ఈఈ గుంటూరు జిల్లా భూగర్భ, ఖనిజశాఖ ఏడీకి పంపించారు. దీంతో అనుమతుల కోసం లంచం ఇవ్వాలని విజయసాగర్ను శ్రీనివాసరావు కోరారు.
అవినీతి తిమింగలాన్ని పట్టుకున్న అనిశా... - కృష్ణా న్యూస్
విజయవాడ కృష్ణా కెనాల్ డివిజన్ పరిధిలోని రివర్ కన్జర్వెన్సీ సబ్ డివిజన్‌లో డీఈఈగా పనిచేస్తోన్న ఉద్యోగి.. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. పట్టా భూముల్లో ఇసుక మేటలను తొలగించేందుకు అనుమతి కోసం డీఈఈని ఆశ్రయించగా భారీగా లంచం ఇవ్వాలని కోరాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు.
అవినీతి తిమింగలాన్ని పట్టుకున్న అనిశా...
అందుకు విముఖత చూపిన దరఖాస్తుదారుడు అనిశాను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు డీఈఈ శ్రీనివాసరావుకు లక్షన్నర రూపాయల నగదును అందిస్తుండగా గుంటూరు అవినీతి నిరోధకశాఖ అధికారులు పట్టుకున్నారు. అతని నుంచి నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో డీఎస్పీలు టి.వి.వి.ప్రతాప్‌కుమార్, జె.వెంకటరావు నేతృత్వంలోని సీఐలు, ఎస్సై, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ రాజ్‌భవన్ ముట్టడి...అడ్డుకున్న పోలీసులు..శైలజానాథ్‌కు గాయాలు