ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళల రక్షణ కోసం 'అభయం'.. వెయ్యి ఆటోల ట్రాకింగ్ నిరంతరం - women safety news

దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం మహిళల రక్షణకు ఉద్దేశించిన ప్రాజెక్టు అభయ్... రాష్ట్రంలో మొదలు కానుంది. ఈ నెల 23న ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో అభయం పేరుతో ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ చేపట్టారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా విశాఖలో 1000 ఆటోలకు ట్రాకింగ్ పరికరాలు అమర్చనున్నారు.

abhayam project is going to be started for safety of women in the state
మహిళల రక్షణ కోసం ప్రారంభం కానున్న అభయం ప్రాజెక్టు

By

Published : Nov 21, 2020, 6:49 AM IST


దిల్లిలో జరిగిన నిర్భయ ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా మహిళల రక్షణకు ఉద్దేశించిన ప్రాజెక్టు అభయ్.. రాష్ట్రంలోనూ మొదలు కానుంది. ఈ నెల 23న సీఎం జగన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా విశాఖలోని వెయ్యి ఆటోల్లో ట్రాకింగ్ పరికరాలు బిగించనున్నారు. మహిళల రక్షణ కోసం ప్రాజెక్టు అభయ్ పేరుతో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రాష్ట్రంలో అభయం పేరుతో ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ చేపట్టారు. ప్రాజెక్టులో భాగంగా... రూ.135 కోట్లతో లక్ష ఆటోల్లో ట్రాకింగ్ పరికరాలు అమర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 60 శాతం మేర నిధులను కేంద్రం భరించనుంది. ఇప్పటికే పరికరాలు కోసం రూ58.64 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆటోల్లో బిగించిన ట్రాకింగ్ పరికరాల వివరాలు స్థానిక పోలీసు స్టేషన్​లో నమోదయ్యేలా సాంకేతికతను సిద్ధం చేశారు. ఈ పరికరాలు బిగింపు అనంతరం మహిళల రక్షణ పరంగా సురక్షితమైన వాతావరణం ఏర్పదుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details