ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ABV Letter To CS: 'నా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదు' - ఏబీవీ తాజా వార్తలు

ABV Letter: తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్​ను రివోక్ చేయాలని కోరారు.

ABV Letter To CS
ABV Letter To CS

By

Published : Jun 9, 2022, 8:49 PM IST

ABV Letter: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు. తన సస్పెన్షన్ విషయంలో హైకోర్టు తీర్పును అమలు చేయటం లేదంటూ ఏబీవీ లేఖలో ప్రస్తావించారు. తనను సస్పెండ్ చేస్తూ గతంలో జీవో జారీ చేసిన కాలం నుంచే తన సస్పెన్షన్​ను రివోక్ చేయాలని కోరారు. హైకోర్టు ఉత్తర్వులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి మాత్రమే తన సస్పెన్షన్ రివోక్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. తన సస్పెన్షన్​ను రివోక్ చేస్తూ ఇచ్చిన జీవోను సవరించాలంటూ వివిధ సందర్భాల్లో తాను చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదని అన్నారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని.. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని లేఖలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details