ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలో.. యువతి ఆత్మహత్యా యత్నం! - ఆత్మహత్య యత్నం

తన ఫొటోలను ఓ యువకుడు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడని ఆరోపిస్తూ.. ఓ యువతి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలో ఆత్మహత్యా యత్నం చేసింది.

ఆత్మహత్య యత్నం
ఆత్మహత్య యత్నం

By

Published : Oct 28, 2021, 9:38 PM IST

విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం సమీపంలో ఓ యువతి ఆత్మహత్యా యత్నం చేసింది. తన ఫోటోలను ఓ యువకుడు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడని ఆరోపించింది. ఈ విషయమై పెనమలూరు పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. కమిషనరేట్ వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

సోషల్ మీడియాలో పరిచయమైన ఆ యువకుడితో.. బాధితురాలు గతంలో సన్నిహితంగా మెలిగింది. అయితే.. ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలని కోరగా.. అతను నిరాకరించినట్టు సమాచారం. ఆ క్రమంలోనే ఆమె కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే.. సదరు యువకుడు ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందట. కానీ.. పోలీసులు పట్టించుకోకపోవటంతో సీపీ కార్యాలయం వద్ద ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన కమిషనరేట్ సిబ్బంది బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:పెళ్లి చేసుకుంటానని తీసుకెళ్లి.. గర్భిణి దారుణ హత్య..!

ABOUT THE AUTHOR

...view details