విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఓ వ్యక్తి భవనం పైనుంచి దూకుతానంటూ హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యక్తిని సముదాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతనితో మాట్లాడుతూనే కింద వలలు పట్టుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు. వంద మందికి పైగా జనం అక్కడ గుమిగూడారు. చివరికి కేసు నమోదు చేయకుండా స్వగ్రామానికి ఛార్జీలు ఇచ్చి పంపుతామని సీఐ లక్ష్మీ నారాయణ హామీ ఇవ్వటంతో అతను కిందకు దిగాడు. వెంటనే అదుపులోకి తీసుకొని అజిత్ సింగ్ నగర్ స్టేషన్కు తరలించారు.
ఆ వ్యక్తి చిత్తూరు జిల్లా కాణిపాకానికి చెందిన బాలాజీగా గుర్తించారు. ఎటువంటి ఆపద లేకుండా వ్యక్తిని కిందకు దించటంతో పోలీసులను స్థానికులు అభినందించారు.