ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కులం పేరుతో రాజకీయాలా?' - aamanchi krishna mohan

ఎంపీ అవంతి శ్రీనివాస్... ఎమ్మెల్యే కృష్ణమోహన్​లు వారి స్వార్థం కోసమే పార్టీని వీడారని తెదేపా నాయకుడు జూపూడి ప్రభాకర్ ఆరోపించారు.

మాట్లాడుతున్న ప్రభాకర్

By

Published : Feb 16, 2019, 11:31 AM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ ఉద్ఘాటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 2019 ఎన్నికల్లో తెదేపా జెండా ఎగరడం ఖాయమన్నారు. ఐదేళ్లు అధికారం అనుభవించి ఆమంచి... అవంతి పార్టీని వీడారని విమర్శించారు. శ్రీనివాస్, కృష్ణమోహన్ వంటి నాయకులు వెళ్లినా పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. వెళ్లిపోతూ ఏ కారాణం చెప్పాలో తెలియక... కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఎన్నడూలోని విధంగా...కాపులను అభివృద్ధి చేసిన విషయం గుర్తుచేశారు.

మాట్లాడుతున్న ప్రభాకర్

ABOUT THE AUTHOR

...view details