woman murder in vijayawada: తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఆ వ్యక్తి భార్యే హత్య చేసిన ఘటన విజయవాడలోని రాణిగారితోటలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు రౌతు సత్య (36) భర్త, కుమార్తెతో కలిసి రాణిగారితోట 18వ డివిజన్ కరెంటు ఆఫీసు పరిసరాల్లో నివాసం ఉంటున్నారు. భర్త భవానీపురంలో ముఠా కార్మికుడిగా, సత్య ఏలూరురోడ్డులో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. ఈక్రమంలో వారు ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉండే ఒరుసు ఆదినారాయణతో సత్యకు ఏడాదిగా పరిచయం ఏర్పడి వివాహేతర బంధంగా మారింది. విషయాన్ని తెలుసుకున్న భర్త పలుమార్లు వారించినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. విసుగు చెందిన భర్త ఇటీవల కుటుంబానికి దూరంగా భవానీపురంలో ఒంటరిగా ఉంటున్నారు.
ఇలా ఉండగా వివాహేతర సంబంధం విషయంపై ఆదినారాయణ భార్య మల్లేశ్వరికి, సత్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో సుమారు 20రోజుల కిందట సత్య ప్రస్తుతం ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి కుమార్తెతో లక్కీబార్ సందులోని ఇంట్లో అద్దెకు దిగింది. ఆదినారాయణ రోజూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఎనిమిదో తరగతి చదువుతున్న సత్య కుమార్తె గురువారం మధ్యాహ్నం హనుమాన్‌జంక్షన్ వెళ్లి రాత్రి 12 గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. లోపలకు వెళ్లి చూడగా, రక్తం మడుగులో తల్లి అచేతన స్థితిలో ఉండటాన్ని గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి పరిశీలించి సత్య మృతిచెందినట్లుగా నిర్ధారించి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు..