విజయవాడలోని మొగల్రాజపురంలో విషాదం చోటు చేసుకుంది. స్థానిక సున్నం బట్టీల వద్ద రేణుక అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య(woman suicide at vijayawada)కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అల్లుడు అంజన్ కృష్ణ వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్య(woman suicide at vijayawada) చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు.
Woman suicide: విజయవాడలో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య - ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
![Woman suicide: విజయవాడలో ఉరేసుకుని మహిళ ఆత్మహత్య Woman commits suicide in Vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13195767-531-13195767-1632811073500.jpg)
11:54 September 28
అల్లుడి వేధింపులతోనే కుమార్తె ఉరేసుకుందని తల్లిదండ్రుల ఆరోపణ
గతేడాది అక్టోబర్లో రేణుకకు అంజన్ కృష్ణతో వివాహం జరిగింది. ఇద్దరు రెండు నెలలు మాత్రమే సక్రమంగా కాపురం చేశారు. అంజన్ కృష్ణ వివాహేతర సంబంధ విషయం తెలిసినప్పటి నుంచి కుమార్తెను చిత్రహింసలకు గురి చేసేవాడని రేణుక కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. చివరకు ఆత్మహత్య చేసుకునేలా చేశాడని రేణుక తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ బిడ్డ మృతికి కారణమైన అంజన్ కృష్ణను కఠినంగా శిక్షించాని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతి( woman suspicious death case)గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న అంజన్ కృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి..