ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

FD Scam: ఎఫ్​డీ స్కాంలో విజయవాడకు చెందిన మరో నిందితురాలు అరెస్ట్

ఆయిల్‌ఫెడ్‌ ఎఫ్‌డీల కేసులో విజయవాడ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో విజయవాడకు చెందిన ప్రమీలా రాణిని పోలీసులు అరెస్ట్ చేశారు(a woman accused arrested in fd scam at vijayawada ). ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన యోహాన్ భార్య.. ప్రమీలా రాణి బ్యాంక్ ఖాతాలోని రూ. 66 లక్షలను సీజ్ చేశారు.

FDI Scam
ఎఫ్​డీ స్కాంలో కొనసాగుతున్న విచారణ

By

Published : Nov 9, 2021, 10:41 PM IST

ఏపీ వేర్ హౌసింగ్ కార్పోరేషన్, కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్​కు చెందిన రూ. 14.5 కోట్ల కుంభకోణం కేసు(fd scam enquiry)లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తాజాగా విజయవాడకు చెందిన ప్రమీలా రాణిని అరెస్ట్ చేశారు(accused arrested in fd scam). ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ. 66 లక్షలను సీజ్ చేశారు. ప్రమీలా రాణి.. ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన యోహాన్ భార్య. తన భర్త అక్రమంగా తెచ్చిన నగదును వేరే ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఆమెను అరెస్ట్ చేశారు.

అయితే గతంలో ఈకేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన నిందితులను విజయవాడ పోలీసులు పీటీ వారెంట్​పై తీసుకొచ్చి విచారించారు. ఈ క్రమంలో ప్రమీలా రాణి వ్యవహారం బయటపడిందని పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించిన నిందితుల బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ. 1.66 కోట్ల నగదు, రూ. 1.7 కోట్ల విలువ చేసే ఆస్తులను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఇదీ చదవండి..SUICIDE : కూలిన ఆశలు...మనస్తాపంతో తల్లీకూతుళ్లు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details