Yadadri temple: తెలంగాణలోని యాదాద్రికొండపై అడవిపంది హల్‌చల్ సృష్టించింది. మధ్యాహ్న సమయంలో క్యూలైన్‌లో నుంచి ఆలయ మాఢవీధిలోకి వచ్చిన అడవిపంది భయంతో పరుగులు తీయడంతో భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆలయసిబ్బంది వెతకగా కాసేపు మాడవీధిలో తిరుగుతూ క్యూ కాంప్లెక్స్ భవనంపైనుంచి దూకి చనిపోయింది. దీంతో కళేబరాన్ని తొలగించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచారు. అడవిపంది ఆలయ మాఢవీధిలోకి రావడంతో లఘు పుణ్యా వచనం కార్యక్రమం చేపడతామని ఆలయ అర్చకులు తెలియజేశారు.
యాదాద్రి కొండపై అడవిపంది హల్‌చల్.. చివరికి..! - యాదాద్రి భువనగిరి జిల్లా తాజా వార్తలు
Yadadri temple: యాదాద్రి ఆలయ మాఢవీధిల్లో అడవిపంది వీరంగం సృష్టించింది. దీంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఆలయసిబ్బంది వెతకగా కాసేపు మాడవీధిలో తిరుగుతూ క్యూ కాంప్లెక్స్ భవనంపైనుంచి దూకి చనిపోయింది.
![యాదాద్రి కొండపై అడవిపంది హల్‌చల్.. చివరికి..! yadadri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15904061-861-15904061-1658571182305.jpg)
yadadri