లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులు తమ లాఠీలకు గట్టిగా పనిచెపుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి బయటకు వచ్చాడు. భార్యా పిల్లల ముందు ఇంటి యజమానిని కొట్టడం బాగుండదని అనుకున్నాడేమో కానీ.. మర్యాదగా పక్కకు పిలిచి చితకబాది పంపించాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
కుటుంబంతో రోడ్డెక్కిన వ్యక్తికి.. పోలీసుల 'మర్యాద'!
రాష్ట్రంలో లాక్డౌన్ను పోలీసులు పటిష్టంగా అమలు చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన వారిని లాఠీలతో వెనక ముందు చూడకుండా బాదేస్తున్నారు. ఓ వ్యక్తి కుటుంబంతో సహా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అడ్డుకున్నారు. అతనికి తమదైన రీతిలో మర్యాద చేశారు.
కుటుంబంతో రోడ్డెక్కిన వ్యక్తిని మర్యాదగా కొట్టిన పోలీసులు