ఉత్తమ విద్యను ఉపాధి మార్గంలో బోధిస్తూ...విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్న విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు...నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, బెంగళూరు 'ఏ' ప్లస్ గ్రేడ్ అందించింది. ప్రధానంగా నాక్ నిర్ధేశించిన 7 ప్రధానాంశాలలో కళాశాల ఉత్తమ ఫలితాలను సాధించిందని...కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల కృషికి మంచి ఫలితం వచ్చిందని ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు. తమ కళాశాల అటానమస్ కావడం వల్ల మూస విద్యా కాకుండా...ఉపాధి అవకాశాలు ఉన్న పాఠ్యాంశాలతో పాటు ఇంటర్న్షిప్, నైపుణ్య అభివృద్ధి శిక్షణ లాంటి కార్యక్రమాలు అమలు చేయడం వల్లే అభివృద్ధి పథంలో సాగుతుందని ఆయన వివరించారు.
ఉత్తమ విద్యా విధానాల వల్లే.. 'ఏ' ప్లస్ గ్రేడ్ - vijayawada
విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మరోసారి ఖ్యాతిని చాటుకుంది. నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్, బెంగుళూరు ఈ కళాశాలకు 'ఏ' ప్లస్ గ్రేడ్ అందించింది. కళాశాల ఉత్తమ ఫలితాలను, మౌలిక సౌకర్యాలు సదుపాయాలు అందించడం వల్లే తమ కళాశాలకు 'ఏ' ప్లస్ గ్రేడ్ సాధ్యమైందని ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణ తెలిపారు.
మరోసారి ఖ్యాతిని చాటుకున్న పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల