ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

pension problem: పింఛన్​ కోసం కలెక్టరేట్​కు మంచంపై వచ్చిన వృద్ధురాలు.. ఎక్కడంటే? - విజయనగరం తాజా వార్తలు

pension: స్థానికంగా చేపట్టిన పింఛన్ల దర్యాప్తునకు అనారోగ్యం కారణంగా ఆమె హాజరు కాలేకపోయింది. ఇంకేముంది పింఛన్ జాబితా నుంచి అధికారులు ఆమె పేరును తొలంగించారు. అయితే రెండు కాళ్లూ, నడుము పని చేయని వృద్ధురాలు పింఛన్ కోసం పడుతున్న కష్టం అందర్నీ కలచివేసింది. చివరికి కుటుంబ సభ్యులు ఆమెను మంచంపై కలెక్టరేట్​కు తీసుకొచ్చారు. ఈ హృదయ విదారకమైన దృశ్యం విజయనగరం కలెక్టరేట్ వద్ద కనిపించింది.

pension in vizianagaram
ఫించన్​ కోసం కలెక్టరేట్​కు మంచంపై వచ్చిన వృద్ధురాలు

By

Published : Mar 7, 2022, 3:54 PM IST

pension in vizianagaram: విజయనగరం కలెక్టరేట్ వద్ద నిర్వహించిన స్పందన కార్యక్రమంలో హృదయ విదారకమైన దృశ్యం కనిపించింది . పక్షవాతంతో రెండు కాళ్లూ, నడుము పని చేయని వృద్ధురాలిని కుటుంబ సభ్యులు మంచంపై మోసుకొచ్చారు... పింఛన్ కోసం పడుతున్న కష్టం అందర్నీ కలచివేసింది. నెల్లిమర్ల మండలం తాళ్లపూడిపేటకు చెందిన సీతమ్మకు.. 70 సంవత్సరాలు. స్థానికంగా చేపట్టిన పింఛన్ల దర్యాప్తునకు అనారోగ్యం కారణంగా హాజరు కాలేకపోయింది. ఫలితంగా పింఛన్ జాబితా నుంచి అధికారులు ఆమె పేరుని తొలగించారు. అప్పటి నుంచి పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరవైంది. పింఛన్ కోసం నడవలేని పరిస్థితిలో ఉన్న వృద్ధురాలిని కుమారుడుతోపాటు తోటి మహిళలు కలెక్టరేట్​కు మంచంపై మోసుకొచ్చారు. కలెక్టర్​ లేని కారణంగా అధికారులు ఆమె నుంచి దరఖాస్తు స్వీకరించారు. పింఛన్ మంజూరు చేయాలని 6 నెలలుగా అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వృద్ధురాలు వాపోయారు.

ఫించన్​ కోసం కలెక్టరేట్​కు మంచంపై వచ్చిన వృద్ధురాలు

ABOUT THE AUTHOR

...view details