ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుర్గం సోయగం... సింపోని సంగీతం.. - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​లోని దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి వద్ద భారత సైన్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. దాదాపు 50 మంది కళాకారులు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

hyderabad
హైదరాబాద్​లోని దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి వద్ద సంగీత కార్యక్రమం

By

Published : Sep 28, 2020, 10:31 AM IST

హైదరాబాద్​లోని దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జి వద్ద సంగీత కార్యక్రమం

హైదరాబాద్​లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు న‌గ‌ర‌ ప్రజలు బారులు తీరారు. ఆదివారం కావడం వల్ల వాహనాలను నిలిపేసి బ్రిడ్జి పై సందర్శకులను అనుమతించారు. వేలాదిగా వచ్చిన సందర్శకులతో కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.

భారత ఉత్తర సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావంగా ఇండియన్ ఆర్మీ నిర్వహించిన సింపోని బ్యాండ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. 50 మంది కళాకారులతో పలు దేశభక్తి, పాశ్చాత్య పాటలకు సికింద్రాబాద్ ఏవోసీ ఆర్మీ బృందంచే గంటపాటు నిర్విరామంగా బ్యాండ్ ప్రదర్శన చేపట్టారు. దీనికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. ఇది చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌ని పుర‌పాలిక శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అర్వింద్ కుమార్ అన్నారు.

ఇవీ చూడండి: దుర్గం చెరువు బ్రిడ్జిపై సింఫోనీ బ్యాండ్​..

ABOUT THE AUTHOR

...view details