ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడి అదృశ్యంపై కలెక్టర్​ స్పందించాలి: జనసేన - జనసేన తాజా వార్తలు

విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడి అదృశ్యంపై బాధితులకు జనసేన సంఘీభావం తెలిపింది. బాధితులతో మాట్లాడిన జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్... కలెక్టర్ ఈ విషయంపై స్పందించాలని కోరారు. వృద్ధుడ్ని ఆసుపత్రిలో చేర్చిన వీడియోలు ఉన్నాయని, వృద్ధుడి కుటుంబ సభ్యులు ఆయన గురించి అడిగితే ఆ పేరుతో ఎవరిని చేర్చుకోలేదని ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని మహేశ్ అన్నారు.

కొవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు అదృశ్యం.. బాధితులకు జనసేన సంఘీభావం
కొవిడ్ ఆసుపత్రిలో వృద్ధుడు అదృశ్యం.. బాధితులకు జనసేన సంఘీభావం

By

Published : Jul 3, 2020, 12:17 PM IST

విజయవాడ కొవిడ్ ఆసుపత్రిలో అదృశ్యం అయిన వృద్ధుడు కుటుంబీకులని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ బాబు పరామర్శించారు. వయోవృద్ధుడైన తన భర్తను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చానని బాధితురాలు తెలిపారని మహేశ్ అన్నారు. వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న వీడియోలు ఉన్నాయన్నారు.

కరోనా పోరులో విశిష్ట సేవలందిస్తున్న వైద్యులను తాము విమర్శించబోమన్న మహేశ్.. నిర్లక్ష్యం తగదని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని కోరారు. జనసేన పార్టీ తరుపున బాధితురాలికి అండగా ఉంటామన్నారు.

ఇదీ చదవండి :కొవిడ్​ నిబంధనలకు నీళ్లు.. వైకాపా నేతల ప్రమాణ కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details