ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ATM Robbery in Nizamabad: ఏటీఎం చోరీకి పాల్పడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ వ్యక్తి - తెలంగాణ వార్తలు

ATM robbery news : ఏటీఎం చోరీకి పాల్పడుతూ ఓ దొంగ రెడ్​హ్యాండెడ్​గా పోలీసులకు చిక్కాడు. తెలంగాణలోని నిజామాబాద్​ నగరంలో ఏటీఎంలోకి సునీల్ అనే వ్యక్తి డబ్బులు తీయడానికి యత్నిస్తుండగా పట్టుబడ్డాడు.

ఏటీఎం చోరీకి పాల్పడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ వ్యక్తి
ఏటీఎం చోరీకి పాల్పడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ వ్యక్తి

By

Published : Nov 29, 2021, 12:43 PM IST

ఏటీఎం చోరీకి పాల్పడుతూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డ వ్యక్తి

ATM Robbery in Nizamabad : ఏటీఎంలో చోరీకి పాల్పడుతూ ఓ దొంగ తెలంగాణలోని నిజామాబాద్ పోలీసులకు ఆదివారం పట్టుబడ్డాడు. నగరంలోని పద్మ నగర్​లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలోకి ఆదివారం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చొరబడ్డాడు. అనుమానంతో స్థానికులు 4వ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... ఏటీఎంలో దొంగతనానికి యత్నిస్తున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

ఏం జరిగింది?

ATM theft news :తని పేరు డిలోడ్‌ సునీల్‌. మాటలు రావు.. చెవులు వినబడవు. తెలంగాణలోని నిజామాబాద్‌ నగర పాలక సంస్థ, పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా చేస్తున్న అతడు సునీల్‌ ఏకంగా స్థానిక పద్మనగర్‌ రహదారిపై ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి చోరీకి యత్నించాడు. ఇనుపరాడ్డుతో యంత్రాన్ని ధ్వంసం చేశాడు. వెంటనే అలారం మోగింది. కానీ వినికిడి సమస్య వల్ల అతడికి ఆ శబ్దం వినిపించలేదు. అక్కడే ఉండి డబ్బు తీసే పనిలో ఉండిపోయాడు. శబ్దం విన్న స్థానికులు మేల్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి కూడా అతడు చోరీ పనిలోనే తలమునకలై ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:Winter Session 2021: 'అన్ని సమస్యలపై చర్చకు సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details