ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లా స్టూడెంట్​ది కిడ్నాప్​ కాదు.. అరెస్టు చేశాం: పోలీసులు - లా స్టూడెంట్

కృష్ణాజిల్లా పెనమలూరు పీఎస్​ పరిధిలో వినోద్​ అనే యువకుని కిడ్నాప్​ కథ మరో మలుపు తిరిగింది . లా స్టూడెంట్​గా ఉన్న వినోద్ కుమార్ ఓ చీటింగ్ కేసులో నిందితునిగా ఉన్నాడని పెనమలూరు పోలీసులు తెలిపారు. వినోద్​ను నెల్లూరు జిల్లా యాదయ్యపాలెం పోలీసులు చీటింగ్ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అరెస్టు
అరెస్టు

By

Published : Oct 4, 2021, 7:40 PM IST

కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో వినోద్ అనే యువకుని(లా స్టూడెంట్​) కిడ్నాప్‌ కథ కొత్త మలుపు తిరిగింది. తన భర్త వినోద్‌ను కిడ్నాప్ చేశారని భార్య ప్రశాంతి.. ఈ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలో తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించారు. అయితే తాజాగా పోలీసులు వినోద్‌ విషయంలో వివరణ ఇచ్చారు. ఓ చీటింగ్ కేసులో వినోద్‌ నిందితునిగా ఉన్నాడని పెనమలూరు పోలీసులు తెలిపారు. ఈ కేసులోనే నెల్లూరు జిల్లా యాదయ్యపాలెం పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details