ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో టైర్ల లోడుతో ఉన్న లారీ దగ్ధం - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

విజయవాడ ఆర్టీసీ వర్క్​ షాప్ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. టైర్ల లోడుతో ఉన్న లారీలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.

lorry burned
lorry burned

By

Published : Nov 16, 2020, 10:49 PM IST

ఆగి ఉన్న లారీలో మంటలు

విజయవాడ ఆర్టీసీ వర్క్ ‌షాప్‌ రోడ్డులో ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. టైర్ల లోడుతో రాయనిపాడు నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తున్న లారీలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో లారీలోని టైర్లు మంటలకు ఆహుతయ్యాయి. లారీకి కొంచెం ఎత్తులోనే విద్యుత్తు వైర్లు ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details