కరోనాపై పోరుకు ఓ బుడతడు సీఎం సహాయ నిధికి తనవంతు సహాయం చేసేందుకు ముందుకొచ్చాడు. విజయవాడకు చెందిన నాలుగేళ్ల హేమంత్ తాను సైకిల్ కొనుక్కోడానికి దాచుకున్న డబ్బులు రూ.971 ని కరోనాపై పోరాటం చేసేందుకు ప్రభుత్వానికి సాయంగా అందించాడు. తాడేపల్లిలోని వైకాపా కార్యాలయానికి తల్లీదండ్రులతో పాటు వచ్చిన హేమంత్... అక్కడికి వచ్చిన మంత్రి పేర్ని నానికి ఆ మొత్తాన్ని అందించారు. చిన్న వయస్సులో ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్న హేమంత్‌ను మంత్రి అభినందించారు. ఇచ్చిన ఆ మొత్తాన్ని సీఎం సహాయ నిధికి తప్పకుండా అందిస్తామని తెలిపారు. హేమంత్ కొనుక్కోవలనుకున్న సైకిల్ని తాను కొనిస్తానని బాలుడికి మంత్రి హామీ ఇచ్చారు.
సీఎం సహాయ నిధికి నాలుగేళ్ల బుడతడి విరాళం
చిన్న పిల్లలు ఎవరైనా ఒక వస్తువు చూస్తే... నాన్న నాకది కొనిపెట్టు అని మారం చేస్తారు. నాన్న జేబులో దొంగచాటుగా చెయ్యి పెట్టి దొరికిన కాడికి కొట్టేస్తారు. కానీ.. నాలుగేళ్ల ఈ బుడతడు మాత్రం వయసులో పెద్దవారు సైతం ముక్కు మీద వేలేసుకునేలా చేశాడు. తను సైకిల్ కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బును సీఎం సహాయ నిధికి తనవంతు సహాయంగా అందించాడు. ఆ మొత్తాన్ని సైకిల్ కొనుక్కునేందుకు అతను దాచుకున్నాడు.
సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన నాలుగేళ్ల బుడతడు