ప్లాస్టిక్ నివారణపై ఈ-ఎఫ్ఎం ఆధ్వర్యంలో ప్రచారం సరాగాల సంగీతంతోపాటు... పసందైన కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తోన్న ఈ - ఎఫ్ఎం మీ ఎఫ్ఎం 91.9...ప్లాస్టిక్ నియంత్రణపై ప్రచారం మొదలుపెట్టింది. సామాజిక బాధ్యతగా మొక్కలు పెంపకంపై అవగాహన కల్పిస్తోంది. ప్లాస్టిక్ రహిత విజయవాడ, గుంటూరు పేరుతో ఈ - ఎఫ్ఎం బృందం విజయవాడ వీధుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని చెబుతూ... మొక్కలు పెంచాలని సూచించింది.
ప్లాస్టిక్ ఇస్తే మొక్కల పంపిణీ
ఈ కార్యక్రమంలో భాగంగా... ఇంట్లోని ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చిన వారికి ఈ - ఎఫ్ఎం సిబ్బంది మొక్కలు పంపిణీ చేశారు. ఒక కిలో ప్లాస్టిక్‌కు ఒక మొక్క చొప్పున పంపిణీ చేశారు. ఆయా కాలనీల్లో ప్రజలు మొక్కలు పెంచేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ఇంట్లో ఉపయోగించే ప్లాస్టిక్ సీసాలు, కవర్లు అందజేసి మొక్కలు తీసుకున్నారు. తప్పనిసరిగా ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తామన్నారు. ఈ ఎఫ్ఎం చేపట్టిన ప్రచార కార్యక్రమాన్ని ప్రజలు అభినందించారు.
ఇదీ చదవండి:
12 ఏళ్ల తర్వాత.. ఇంటికి చేరిన కన్నప్రేమ