ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 9pm - TOPNEWS

.

ప్రధాన వార్తలు @ 9pm
ప్రధాన వార్తలు @ 9pm

By

Published : Dec 22, 2021, 9:01 PM IST

Updated : Dec 22, 2021, 9:15 PM IST

  • విభజన హామీలు చాలా నేరవేర్చాం.. మరికొన్ని అమలు దశలో ఉన్నాయి - కేంద్రం
    Centre On AP Bifurcation Promises: విభజన హామీలు చాలా వరకు నెరవేరాయని.. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు.. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • MLA Ambati On Special Status For AP: 'ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తాం'
    MLA Ambati On Special Status For AP: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకూ వైకాపా వెనక్కి తగ్గదని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. హోదా కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. నాడు ప్యాకేజీ తీసుకుని ప్రత్యేక హోదాను ముంచిన వ్యక్తి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వీధిరౌడీల్లా అశోక్ గజపతిరాజుపై.. మంత్రులు దాడికి తెగించారు: చంద్రబాబు
    Chandrababu Fires On Ministers: రామతీర్థం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని ఆరోపించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Ramoji Foundation: మరో రెండు కార్యక్రమాలకు రామోజీ ఫౌండేషన్​ శ్రీకారం..
    Ramoji Foundation: సామాజిక బాధ్యత నిర్వర్తించడంలో ఎల్లప్పుడూ ముందుండే రామోజీ ఫౌండేషన్​.. మరో రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్​మెట్​లో నిర్మించతలపెట్టిన రెవెన్యూ కార్యాలయ భవనాలకు తనవంతు సహకారం అందిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కొవిడ్​ టీకా తీసుకోని ఉద్యోగులకు జీతం కట్​!
    Vaccine Restrictions: దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. టీకా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని పంజాబ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హరీశ్​ రావత్ తిరుగుబాటు? తీవ్ర సంక్షోభంలోకి కాంగ్రెస్​?
    Harish Rawat rebel: కాంగ్రెస్​ నాయకత్వం అనుసరిస్తున్న తీరును బహిరంగంగానే ప్రశ్నించి.. సంచలనం సృష్టించారు ఆ పార్టీ సీనియర్​ నేత, ఉత్తరాఖండ్​ మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​. పార్టీ తన చేతులను కట్టేసిందని విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వేల ఏళ్లనాటి డైనోసార్​ గుడ్డుపై రీసెర్చ్- ఏం తెలిసిందంటే...
    Dinosaur embryo: వేల ఏళ్లనాటి డైనోసార్​ గుడ్డు శిలాజాన్ని చైనాలో ఉంది. దీన్ని బేబీ ఇంగ్లియాంగ్ అని పురాతత్వ శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. లోపల కోడి పిల్ల మాదిరిగా డైనోసార్‌ పిల్ల రూపం స్పష్టంగా కనిపిస్తున్న ఈ గుడ్డు శిలాజం 27 సెంటీమీటర్ల పొడవు ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వాట్సాప్​లో అదిరే ఫీచర్లు- గ్రూప్ కాలింగ్​కు నయా లుక్​!
    Whatsapp new features: మెసెంజర్ దిగ్గజం వాట్సాప్ త్వరలో సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్​ చాట్, కాలింగ్​కు కొత్త లుక్​ను ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేగాక గ్రూప్ అడ్మిన్​లకు మరిన్ని అధికారాలు ఇవ్వనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • IPL 2022: ఐపీఎల్​ మెగావేలానికి ముహూర్తం ఫిక్స్​
    IPL 2022 Mega auction: బెంగళూరు వేదికగా ఐపీఎల్​ 2022 మెగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఓ బోర్డు అధికారి తెలిపారు. ఫిబ్రవరి 7,8 తేదీల్లో ఈ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆర్ఆర్ఆర్' టీమ్​తో భళ్లాలదేవ.. ధనుష్ తెలుగు సినిమా అప్డేట్​
    సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో ఆర్ఆర్ఆర్ టీమ్​తో రానా ఫొటో, ధనుష్ తెలుగు సినిమా టైటిల్, భళా తందనాన చిత్రాల గురించిన కొత్త సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
Last Updated : Dec 22, 2021, 9:15 PM IST

ABOUT THE AUTHOR

...view details