- కార్మిక గర్జన
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన 'ఉక్కు కార్మిక గర్జన' బహిరంగ సభ.. విశాఖపట్నంలోని తృష్ణ మైదానంలో ప్రారంభమైంది. ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు కేంద్రానికి లేదని కార్మిక సంఘం నేతలు స్పష్టం చేశారు. పరిశ్రమలు ప్రైవేటు పరమైతే కార్మిక చట్టాలు కనుమరుగు కావటం ఖాయమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ప్రైవేట్ సంస్థకు అప్పగింత...
ఇసుక రీచుల్లో తవ్వకాల బాధ్యతల్ని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీకి అప్పగించింది. రాష్ట్రంలోని ఇసుక రీచులను మూడు ప్యాకేజీలుగా విడగొట్టి వేలం నిర్వహించారు. ఎంఎస్టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) నిర్వహించిన బిడ్డింగ్‌లో తొలి స్థానంలో నిలిచిన జయప్రకాష్ పవర్ వెంచర్స్.. 3 ప్యాకేజీలనూ దక్కించుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కలకలం
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం మహాగర్జనకు సర్వం సిద్ధమైన వేళ.. శ్రీనివాసరావు అనే ప్లాంట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ రాసిన లేఖ కలకలం రేపుతోంది. గాజువాకకు చెందిన శ్రీనివాసరావు.. ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ లభ్యమైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- వాణీదేవి గెలుపు
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు పూర్తయింది. ఈ ఉత్కంఠ పోరులో తెరాస అభ్యర్థి, మాజీ ప్రధాని పీవీ కుమార్తె సురభి వాణీదేవి విజయం సాధించారు. ఈ మేరకు ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'టీ పరిశ్రమను నాశనం చేసే వారితో కాంగ్రెస్ జట్టు'
అసోంలో తేయాకు రంగాన్ని నాశనం చేయాలనుకునే వారికే కాంగ్రెస్ మద్దతునిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అసోం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విజయం వరించేనా?