- సీఐడీ కేసులో చంద్రబాబు, నారాయణకు ఊరట
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. వారిద్దరిపై సీఐడీ నమోదు చేసిన కేసు విచారణపై హైకోర్టు 4వారాల పాటు స్టే విధించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రాజధాని అమరావతికి స్వచ్ఛందంగానే భూములిచ్చాం'
రాజధాని అసైన్డ్ భూముల కేసులో సీఐడీ ముమ్మర విచారణ జరిపింది. గంటూరు జిల్లా తాడేపల్లి పోలీసు స్టేషన్లో సీఐడీ విచారణకు పలువురు ఎస్సీ రైతులు హాజరయ్యారు. తమ భూములను రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చామని రైతులు సీబీఐ అధికారులకు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ
సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై.. నేడు సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసును.. కోర్టు ఈ నెల 26కు వాయిదా వేయగా.. రఘురాం సిమెంట్స్ కేసు ఈ నెల 22కు వాయిదా పడింది. దాల్మియా కేసు ఏప్రిల్ 9కి, ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా పడ్డాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'నాకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదు'
ప్రివిలేజ్ మోషన్ నోటీసుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శాసనసభా కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు లేఖ రాశారు. శాసనసభ, ఎమ్మెల్యేలపై అపారమైన గౌరవం ఉందన్న ఆయన...తనకు జారీ చేసిన నోటీసులకు విచారణ పరిధి లేదన్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బంగాల్లో నిష్పాక్షిక ఎన్నికలు కష్టమే!'
బంగాల్లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా లేవని తృణమూల్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలింగ్ స్టేషన్లకు వంద మీటర్ల దూరంలోనే రాష్ట్రబలగాలు ఉండాలని ఈసీ నిర్ణయించిందన్న వార్తలను ప్రస్తావిస్తూ... ఎన్నికల సంఘానికి నిరసన తెలిపింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'రైతు నిరసనలపై దేశ వ్యతిరేక శక్తుల ప్రభావం'