ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9pm - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

9pm_topnews
ప్రధాన వార్తలు @ 9pm

By

Published : Jan 3, 2021, 9:02 PM IST

  • 'అన్నిదేశాలకు అందిస్తాం'

కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతించడంపై భారత్ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల హర్షం వ్యక్తం చేశారు. తాము తయారు చేసిన వ్యాక్సిన్​ సురక్షితమైనదని.. వైరల్ ప్రోటీన్లను తట్టుకునేలా కొవాగ్జిన్​ను తయారుచేసినట్టు ఆయన తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరో ఘటన..

రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం కొనసాగుతోంది. రామతీర్థం, రామమహేంద్రవరం ఘటనలు మరువక ముందే.. విజయవాడలో మరో మందిరంలో విగ్రహం ధ్వంసం చేశారు. సీతమ్మవారి మట్టి విగ్రహం విరిగిపోవడంపై తెలుగుదేశం, భాజపా నేతలు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

  • 'దేశం మొత్తానికి అవమానం'

రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్​ఛార్జ్ సునీల్ దేవధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామతీర్థం ఘటన దేశం మొత్తానికి జరిగిన అవమానమని వ్యాఖ్యానించారు. పరిపాలన నుంచి సీఎం జగన్ తప్పుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'కక్ష సాధింపులో భాగమే'

ఎమ్మెల్సీ‌ బీటెక్‌ రవిని కడప పోలీసులు చెన్నైలో అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో...తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టడంపై మండిపడ్డారు. బాధితులకు అండగా ఉండటం తెదేపా నేతల చేసిన నేరమా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చర్చలకు కేంద్రం సిద్ధం

కేంద్రం, రైతు సంఘాల మధ్య సోమవారం ఏడో విడత చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో కొత్త సాగు చట్టాల రద్దుపై ప్రభుత్వం కచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్​ చేస్తున్నారు. అలా జరగకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విషాదం..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అంత్యక్రియలకు హాజరైన సమయంలో శ్మశానవాటిక ప్రాంగణ పైకప్పు కూలి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కార్మికుల కాల్చివేత

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ రాష్ట్రంలో ఘోరం జరిగింది. 11 మంది బొగ్గు గని కార్మికులను.. ముష్కరులు కాల్చి చంపారు. పనికెళ్తున్న వారిని అపహరించి సమీప కొండల్లోకి తీసుకెళ్లి బలితీసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఇక చట్టపరమైన మద్దతు!

తయారీ, గనులు, సేవా రంగాలకు సంబంధించి ఇండస్ట్రీయల్ రిలేషన్స్​ కోడ్​లో కీలక మార్పులు చేసింది కేంద్ర కార్మిక శాఖ. దీనికి సంబంధించి స్టాండింగ్ ఆర్డర్స్​ ముసాయిదానూ ఇటీవల విడుదల చేసింది. వర్క్​ ఫ్రం హోం సహా వివిధ అంశాలపై ఈ ముసాయిదాలో పేర్కొన్న అంశాల వివరాలు ఇలా ఉన్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • థాయ్​లాండ్​కు పయనం

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న థాయ్​లాండ్ ఓపెన్ కోసం బయల్దేరారు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు. సైనా, సాయి ప్రణీత్, శ్రీకాంత్​తో పాటు మరికొందరు థాయ్​లాండ్ వెళ్లారు. సింధు నేరుగా లండన్ నుంచి బ్యాంకాక్ పయనం కానుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'చైసామ్'​కు వేళాయె

'ఆహా' వేదికగా సమంత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'సామ్ జామ్' టాక్​ షోకు అక్కినేని నాగచైతన్య అతిథిగా విచ్చేశారు. ఈ విషయాన్ని 'ఆహా' తమ ట్విట్టర్​ ఖాతాలో పేర్కొంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details