ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

9pm top news
ప్రధాన వార్తలు @ 9pm

By

Published : Feb 24, 2021, 9:00 PM IST

  • ఈ ఏడాది నుంచే
    మన బడి నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ ఏడాదే ఒకటి నుంచి ఏడో తరగతి వరకు సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశ నాడు – నేడు పనులు మార్చి నెలాఖరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • కమిటీ ఏర్పాటు
    పోలవరం డంపింగ్ పిటిషన్‌పై ఎన్‌జీటీ రాతపూర్వక ఆదేశాలు జారీ చేసింది. పోలవరంలో అదనపు భద్రతా చర్యల అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • దారుణం
    డిగ్రీ విద్యార్థిని ఓ అగంతకుడు గొంతు నులిమి హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. హత్య చేసి ఆమె మృతదేహాన్ని కాలువలో పడేశాడు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, విద్యార్థులు పల్నాడు బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రచార జోరు
    విజయవాడలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కురసాల కన్నబాబు ఎన్నికల ప్రచారంలో అందరినీ ఆకట్టుకున్నారు. కొండ‌వీడు అకాడ‌మీ నుంచి ప్రియ‌ద‌ర్శ‌ని కాల‌నీ, పాత హౌసింగ్ బొర్డు కాల‌నీల్లో ప్రచారం నిర్వహించిన మంత్రులు.. టీ దుకాణం వద్ద ఆగి.. వారు స్వయంగా టీ చేసి తాగారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వ్యాపారం ప్రభుత్వ విధి కాదు: మోదీ
    నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను నడపడం దేశ ఆర్థిక వ్యవస్ధకు భారమని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రభుత్వమే స్వయంగా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదన్నారు. వ్యాపారం ప్రభుత్వ విధి కాదన్న ప్రధాని.. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'అల్లర్ల సృష్టిలో మోదీ నం.1!'
    బంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ కంటే దుర్భర పరిస్థితి మోదీకి ఎదురవుతుందని జోస్యం చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పాత పద్ధతికే జై​
    అమెరికా పౌరసత్వం ప్రక్రియకు సంబంధించి గతేడాది అమలులోకి వచ్చిన విధానాన్ని అధ్యక్షుడు బైడెన్ రద్దు చేశారు. ఆ స్థానంలో ఒబామా హయాంలో ప్రవేశపెట్టిన విధానాన్ని పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • షేర్ల దూకుడు
    వరుస నష్టాలను చవి చూసిన స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1,030 పాయింట్లు పెరిగి 50,781 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 281 పాయింట్లు పుంజుకుని 14,988 కు చేరుకుంది. ఆర్థిక షేర్లు రాణించాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • స్పిన్నర్ల ధాటికి విలవిల
    అహ్మదాబాద్​ వేదికగా జరుగుతున్న పింక్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ జట్టు 112 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్​ జాక్​ క్రావ్లే అర్ధ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో అక్షర్​ 6, అశ్విన్​ 3 వికెట్లు తీసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'శూన్యంలోనూ ముందుకు నడిపిస్తారు'
    అందాల నాయిక శ్రీదేవి కన్నుమూసి మూడేళ్లవుతోంది. ఈ సందర్భంగా బోనీ కపూర్ తన కూతుళ్లతో కలిసి చెన్నైలోని మైలాపూర్​లో ఆమె జ్ఞాపకార్థం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details