ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @9PM - ఏపీ ప్రధాన వార్తలు

...

9PM TOP NEWS
ప్రధాన వార్తలు @9PM

By

Published : Dec 25, 2020, 9:01 PM IST

  • ' వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్లు కాదు.. వేల ఊళ్లు కడుతున్నాం'
    అత్యంత పారదర్శకంగా ఇంటిస్థలాలు ఇస్తున్నామని సీఎం జగన్​ అన్నారు. రాబోయే రోజుల్లో 17,005 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలు రాబోతున్నాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొమరగిరిలో 'నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ నెల 28న ఏపీలో కరోనా టీకా డ్రై రన్‌
    కరోనా వ్యాక్సిన్​ను వేసేందుకు ముందస్తుగా డ్రై రన్ నిర్వహించాలని కేంద్రం.. రాష్ట్రాలకు సూచించింది. వ్యాక్సిన్‌ వాస్తవ పంపిణీలో సవాళ్లు గుర్తించడమే లక్ష్యంగా డ్రై రన్ నిర్వహించనున్నారు. ‌డిసెంబరు 28, 29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన జిల్లాల్లో వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇళ్ల పట్టాల పంపిణీ మోసపూరితం : అచ్చెన్నాయుడు
    ప్రభుత్వం ఇచ్చిన 28లక్షల ఇళ్లపట్టాల ప్రకటన మోసపూరితమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇందులో 70 శాతం మందికి నివాసముంటున్న సొంత స్థలానికి పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి ప్రభుత్వమే ఇచ్చినట్లు మభ్యపెడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి
    తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఘనంగా ప్రారంభమైంది. ఏకాదశి పర్వదినాన ధునర్మాస కైంకర్యాలు నిర్వహించిన అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వారం తెరిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'స్వీయ అజెండాతో రైతు నిరసనలపై రాజకీయం'
    రైతుల సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. స్వీయ అజెండాతో రైతు నిరసనలు విపక్షాలు దుర్వినియోగం చేస్తున్నాయని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగాల్​ బరిలో 'తెలుగు' ఆట- దీదీ అస్త్రం ఫలించేనా?
    తెలుగు భాషకు బంగాల్​లో అధికారిక గుర్తింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇది ఎన్నో ఏళ్లుగా ఖరగ్​పుర్​లో నివసించే తెలుగువారి కల. అయితే ఇంతకాలంగా ఈ విషయాన్ని పట్టించుకోని మమత సర్కార్​ ఆగమేఘాలపై తెలుగుకు గుర్తింపు ఇవ్వడం రాజకీయ విమర్శలకు తావిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పార్లమెంటు రద్దుపై నేపాల్​ ప్రధానికి నోటీసులు
    నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ సుప్రీంకోర్టు షోకాజు నోటీసులు జారి చేసింది. పార్లమెంటును అర్థాంతరంగా రద్దు చేసిన విషయమై రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 3.97 కోట్ల ఐటీఆర్​లు దాఖలు
    2019-20 ఆర్థిక సంవత్సరానికి డిసెంబర్​ 24నాటికి మొత్తం 3.97 కోట్ల మంది ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా ఉంటే డిసెంబర్ 31లోగా ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'బాక్సింగ్​ డే' టెస్టుకు భారత్ సై.. మరి గెలుపు?
    రహానె సారథ్యంలోని టెస్టు బృందం.. ఆసీస్​తో 'బాక్సింగ్ డే' మ్యాచ్​కు పూర్తి సిద్ధంగా ఉంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5 గంటలకు మ్యాచ్​ మొదలు కానుంది. మరి తొలి టెస్టు ఓటమికి మన ఆటగాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారా?. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రజినీకాంత్​కు అస్వస్థత..​ హైదరాబాద్ అపోలోలో చికిత్స..
    సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో ఆయనకు చికిత్సకు అందిస్తున్నారు. రజనీకాంత్‌కు బీపీలో తీవ్రమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని వైద్యులు వెల్లడించారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అన్నత్తై చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details