- చలో గుంటూరు జైలు..
రాజధాని పరిరక్షణ సమితి ఐకాస చలో గుంటూరు జైలుకు పిలుపునిచ్చింది. రైతులకు సంకెళ్లు వేయడంపై అమరావతి ఐకాస, తెదేపా ఆందోళన చేయాలని నిర్ణయించాయి. అయితే నేతలను రాజధాని ప్రాంతం నుంచి గుంటూరు వెళ్లకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పోలవరం నిధుల్లో మరింత కోత?
పోలవరం ప్రాజెక్టు కట్టుబడికే తప్ప.. పునరావాసంతో సంబంధం లేదని ఇటీవలే బాంబు పేల్చిన కేంద్రం.. మరిన్ని నిధుల కోతకు సిద్ధమైంది. ప్రాజెక్టులో భాగంగా తాగునీటి సరఫరాతోపాటు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిధులివ్వరాదని నిర్ణయించింది. ఆ మేరకు మొత్తం వ్యయంలో కోతపెట్టాలని కేంద్రజలశక్తి శాఖ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- ముంబయి ఐఐటీలో చంద్రబాబు ప్రసంగం
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు..ముంబయి ఐఐటీలో ఇవాళ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఐఐటీకి చెందిన మేనేజ్మెంట్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగం చేయనున్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- బతికుండగానే చంపేశారు!
ఒకరి పేరుమీదున్న ఆస్తిని... వారు మృతిచెందినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, సంతకాలు ఫోర్జరీ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ చేసేశారు అక్రమార్కులు. ఆ ఆస్తిని తిరిగి విక్రయించే క్రమంలో బయటకు తెలియడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి గాజువాక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ ఉదంతం విశాఖలో బయటపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- హైటెక్ యుద్ధం
హైటెక్ సాంకేతికతను సమకూర్చుకోవడంపై దృష్టి సారించింది భారత సైన్యం. సైనిక కార్యకలపాలు, నిఘా, గూఢ చర్యం వంటి అంశాల్లో ఈ అధునాతన పరిజ్ఞానాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతోంది. దిల్లీలో జరిగిన సైనిక కమాండర్ల సదస్సు (ఏసీసీ)లో ఈ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- పాక్ ప్రకటనతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి