ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @9PM - ap top ten news

.

9PM TOP NEWS
ప్రధాన వార్తలు @9PM

By

Published : Oct 7, 2020, 9:00 PM IST

  • 'కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం ఉండదు'

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉద్ఘాటించారు. ఇక నుంచి పంట ఉత్పత్తుల విక్రయంలో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండబోదని స్పష్టం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అమరావతి'పై వాదనలు.. రిట్ పిటిషన్ల విభజనకు హై కోర్టు ఆదేశం

హైకోర్టులో రాజధానికి సంబంధించిన అనుబంధ వ్యాజ్యాలపై వాదనలు జరిగాయి. రిట్‌ పిటిషన్లను అంశాలవారీగా విభజించే బాధ్యతను అటార్నీ జనరల్‌తోపాటు పిటిషనర్‌ తరఫు నలుగురు న్యాయవాదులకు ధర్మాసనం అప్పగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 5,120 కరోనా కేసులు, 34 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కేసుల సంఖ్య 7,34,427కు చేరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గొడవ ఆపేందుకు ప్రయత్నించబోతే... లారీ కిందకు తోసేశారు!

బంధువుల గొడవను ఆపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎదురెదురుగా ఉంటున్న రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి. తమనే వంకపెట్టి తిడుతున్నారని ఇరువురూ వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ కాస్త పెద్దదే కర్రలతో దాడి చేసుకునే వరకు వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనాపై అవగాహనకు కేంద్రం మరో కార్యక్రమం

దేశంలో కొవిడ్​ నిర్మూలనకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గురువారం నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శశికళకు షాక్​- రూ.2000 కోట్ల ఆస్తులు జప్తు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళకు చెందిన రూ. 2000కోట్లు విలువైన ఆస్తులను అటాచ్​ చేసింది ఐటీ శాఖ. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా పళనిస్వామిని అన్నాడీఎంకే ప్రకటించిన రోజునే ఐటీశాఖ ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హెచ్​-1బీ కొత్త రూల్స్​తో మనకు నష్టం తప్పదా?

మరికొన్ని వారాల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో హెచ్​-1బీ వీసాలకు కొత్త నిబంధనలను విధించింది ట్రంప్​ ప్రభుత్వం. అమెరికన్లకు ఈ నిబంధనలు మరింత మేలు చేయనున్నట్టు పేర్కొంది. అయితే వీటి వల్ల భారతీయ ఐటీ నిపుణులకు నష్టం తప్పదని పరిశీలకులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇకపై అమెజాన్​లో రైలు టికెట్ల బుకింగ్​

ఐఆర్​సీటీసీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్​ ఇండియా. ఇందులో భాగంగా రైలు టికెట్లను బుక్​ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది. వివిధ రూపాల్లో డిస్కౌంట్లు కూడా అందివ్వనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యూరోపియన్​ టూర్​కు​ మేరీకోమ్​ దూరం

డెంగీ జ్వరంతో బాధపడుతున్న స్టార్ బాక్సర్​ మేరీకోమ్​ ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక యూరోపియన్​ టూర్​ నుంచి తప్పుకుంది. ఇప్పడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జైలు నుంచి విడుదలైన రియా చక్రవర్తి

డ్రగ్స్​ కేసులో అరెస్టయన బాలీవుడ్​ నటి రియా చక్రవర్తికి బాంబే హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత బైకుల్లా జైలు నుంచి ఆమె విడుదలైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details