రాష్ట్రంలో కొత్తగా 9,901 కరోనా కేసులు - భారతదేశంలో కరోనా వైరస్
17:44 September 12
వైరస్ కారణంగా మరో 67 మంది మృతి
రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గడం లేదు. కొత్తగా 9,901 కరోనా కేసులు నమోదవ్వగా.. మెుత్తం బాధితుల సంఖ్య 5,57,587కి చేరింది. తాజాగా మరో 67 మంది వైరస్‌కు బలయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 4,846 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 95,733 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 10,292 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మెుత్తం 4,57,008 మంది బాధితులు వైరస్ బారి నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 75,465 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు 45,27,593 కరోనా పరీక్షలు జరిగాయి.