రాష్ట్రంలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు
17:16 September 19
వైరస్‌కు మరో 58 మంది బలి
రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గలేదు. 24 గంటల వ్యవధిలో 74వేల 595 మందికి పరీక్షలు చేయగా... 8వేల 218 మందికి పాజిటివ్ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 13వందల 95 మందికి కరోనా సోకింది. పశ్చిమగోదావరిలో1071, చిత్తూరులో 736, నెల్లూరులో 693 కేసులు వచ్చాయి. ప్రకాశంలో 670, కడపలో 520, శ్రీకాకుళంలో 485 మంది కొవిడ్ బారిన పడ్డారు. అనంతపురంలో 477, గుంటూరులో 471, కృష్ణాలో 468మందికి మహమ్మారి సోకింది. విజయనగరంలో 462, విశాఖలో 451, కర్నూలులో 319 కేసులు వచ్చాయి. మొత్తం బాధితుల సంఖ్య 6 లక్షల 17వేల 776కి చేరింది. 81వేల 763 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 5లక్షల 30వేల 711 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 50లక్షల 33వేల 676 మందికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు స్పష్టం చేశారు..
కొవిడ్ కాటుకు కొత్తగా 58 మంది ప్రాణాలు విడిచారు.చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 9 మంది చనిపోయారు. కృష్ణాలో 7, అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో నలుగురు చొప్పున ప్రాణాలు వదిలారు. తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 5వేల 302కు పెరిగింది..